బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజం

by Kema Shiva Kumar |

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇవాళ హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని తీసేశామనేది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

దేశంలో మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనేక వ్యవస్థాగత మార్పులు, సంస్కరణలు చేపడుతోందని కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు పారదర్శకతను పెంచేందుకు కొన్ని కీలక మార్పులు చేశామని వివరించారు. కానీ, విపక్షాలు ఈ విషయంలో బీజేపీ (BJP)పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పథకం పేరు మార్పు కేవలం అభివృద్ధి లక్ష్యంతో, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే చేశామని అన్నారు. దీంతో లబ్ధిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అసత్యాలు ప్రచారం చేయకుండా.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గమనించాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.

Next Story