- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా ఐఏఎస్‌పై అసత్య ప్రచారం.. ప్రముఖ న్యూస్ ఛానల్ సహా పలు యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదు
ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై అసత్య, నిరాధారమైన వార్తలను ప్రసారం కావడం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై అసత్య, నిరాధారమైన వార్తలను ప్రసారం కావడం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇలాంటి తప్పడు వార్తలపై తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్,IAS Officers Association ఐపీఎస్ అసోషియేషన్ తీవ్రంగా ఖండించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐఏఎస్ అసోసియేషన్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ (Jayesh Ranjan) ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఎన్‌టీవీ (NTV) యాజమాన్యం, పలు ఇతర సోషల్ మీడియా ఛానళ్లపై ఎఫ్ఐఆర్ (FIR No: 07/2026) నమోదు చేశారు.
జనవరి 8న ఎన్‌టీవీలో ప్రసారమైన ఒక వార్తా కథనంలో, ఒక మహిళా ఐఏఎస్ (Female IAS) అధికారికి రాజకీయ నాయకులతో సంబంధం ఉందని, ఆమెకు వచ్చిన పోస్టింగ్‌లు (పదోన్నతులు) ఈ ప్రభావంతోనే వచ్చాయని పరోక్షంగా ఆరోపించారు. ఈ కథనంలో ఆమె పేరు ప్రస్తావించనప్పటికీ, ఆమె గతంలో నల్గొండ కలెక్టర్‌గా, ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారని పేర్కొంటూ ఆమె గుర్తింపును పరోక్షంగా వెల్లడించారని, ఇది ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, ఆమె నైతికతను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వార్తలో అసభ్యకరమైన వ్యాఖ్యలు (sexual innuendos), ద్వంద్వ అర్థాలు ఉన్నాయని ఐఏఎస్ అసోసియేషన్ ఆరోపించింది.
ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు గాను ఈ కింది ఛానళ్లపై కూడా కేసు నమోదు చేశారు
ఎన్‌టీవీ (NTV) యాజమాన్యం, ఎడిటర్లు, రిపోర్టర్లు
తెలుగు స్క్రైబ్ (Telugu Scribe - X handle)
ఎంఆర్ మీడియా తెలంగాణ (MR Media Telangana)
ప్రైమ్9 తెలంగాణ (Prime9 Telangana)
పీవీ న్యూస్ (PVNEWS)
సిగ్నల్ టీవీ తెలుగు (Signal TV Telugu)
వోల్గా టైమ్స్ (Volga Times)
మిర్రర్ టీవీ అఫీషియల్ (MirrorTyOfficial)
టీ న్యూస్ తెలుగు (Tnews Telugu)
చట్టపరమైన చర్యలు:
జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 75, 78, 79 (వేధింపులు, మహిళల గౌరవానికి భంగం కలిగించడం), 351(1), 352(2) (శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అవమానించడం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ వార్తలపై ఇప్పటికే స్పందించిన మంత్రులు, అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని వారు డిమాండ్ చేశారు. ఏకంగా ఓ మంత్రి, ఐఏఎస్ అధికారిణిపై ఇలాంటి తప్పుడు వార్తలు రావడంపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.






