- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర ఉద్రిక్తత: బొడ్రాయిని అపవిత్రం చేసిన వ్యక్తి.. చితకబాదిన స్థానికులు
హైదరాబాద్‌లో నగరంలో శనివారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బొడ్రాయిని అపవిత్రం చేయడం తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నగరంలో శనివారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బొడ్రాయిని అపవిత్రం చేయడం తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ (Neredmet Police Station) పరిధిలో కట్ట మైసమ్మ గుడి (Katta Maisamma Temple) వద్ద ఉన్న పవిత్రమైన బొడ్రాయి (Bodrai)పై ఓ మతానికి చెందిన వ్యక్తి.. మూత్రం పోసి అపవిత్రం చేశాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ దుశ్చర్యను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలియగానే భారీ సంఖ్యలో ప్రజలు ఘటనాస్థలికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న నేరెడ్‌మెట్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆగ్రహంతో ఉన్న జనాల నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
- Tags
- Bodrai






