- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల పేరిట' పైసా వసూల్..
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పేదలకు అందించే పథకాలు కొంత మంది నేతలకు బాగా కలిసొచ్చింది.

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పేదలకు అందించే పథకాలు కొంత మంది నేతలకు బాగా కలిసొచ్చింది. స్థానిక నాయకత్వానికి, అధికారులకు దగ్గర ఉంటూ అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ముడుపులు ముట్టజెప్పిన వారంతా ఇన్నాళ్లు తమ మనసులో దాచుకున్న విషయాన్ని ప్రస్తుతం ఒక్కొక్కరుగా బయటికి చెబుతున్నారు. ఇక మౌనంగా ఉంటే తాము నష్టపోవాల్సి వస్తుందనే భావన బాధితుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో, ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు కట్టుకునేందుకు ముందుకు వస్తుండగా.. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునే విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు బ్రోకర్లుగా మారారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుల నుంచి లంచం రూపంలో తీసుకోవద్దని సమావేశాలలో పార్టీ ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పినా.. వారి మాటలు డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తూ సీక్రెట్ గా లబ్ధిదారుల నుంచి డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది.
తక్కువలో తక్కువ దావత్ అన్నా..!
మొదటి విడతతో పాటు, రెండో విడత కూడా ఇండ్లు ఇచ్చేందుకు సర్కార్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇల్లు మంజూరు చేయించి అన్నీ నేను చూసుకుంటానంటూ భరోసానిస్తూ డబ్బులు కూడా మాట్లాడుకుంటూ అడ్వాన్స్ గా కొందరు డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఉచితంగా రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణానికి వస్తున్నాయనే అన్న భావనతో కొందరు నాయకులు కార్యకర్తలు, పొట్ట తిప్పలంటూ బ్రోకర్లుగా మారి ఒక్కో లబ్ధిదారుడి నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ప్రచారం గ్రామాల్లో జరుగుతోంది. అయితే ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మూడు నాలుగు విడతల్లో డబ్బులు పడుతుండడంతో బ్రోకర్లు డబ్బులు అడిగే విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
ఎవరికైనా ఈ విషయం బయట తెలిస్తే ఎక్కడ డబ్బులు ఆగిపోతాయో నన్న భయంతో గప్ చూప్ గా వారు ఉండిపోతున్నారు. గృహప్రవేశాలు చేసుకున్న కొందరు లబ్ధిదారులు మొదట ఏమీ ఇవ్వకపోవడంతో, తక్కువలో తక్కువ దావత్ చేసుకునేందుకు అయినా ఎంతో కొంత ముట్ట జెప్పాలని కొందరు చివరి మాటగా అడుగుతుండడంతో మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు లబ్ధిదారులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈ తరహా వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. హౌసింగ్ ఏఈ భవ్యని వివరణ కోరగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏ ఒక్కరైనా ప్రజల నుండి వరకు డబ్బులు వసూలు చేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకోబడును, వారిని ఇందిరమ్మ కమిటీ నుంచి తీసివేయడం జరుగుతుందని అన్నారు.






