- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదరిక నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ
టీజీఐఎల్పీ గురించి సోమవారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ప్రోగ్రాంకు ఎంపికైన వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : టీజీఐఎల్పీకి ఎంపికైన గట్టు మండలంలో పేదరిక నిర్మూలనకు సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. తెలంగాణ ఇంక్లూజివ్ లైవ్‌లిహుడ్ ప్రోగ్రామ్ (టీజీఐఎల్పీ) గురించి సోమవారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ప్రోగ్రాంకు ఎంపికైన వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో అత్యంత పేద కుటుంబాలను శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే తెలంగాణ ఇంక్లూజివ్ లైవ్‌లిహుడ్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం, జీవనోపాధి కోసం నిరంతర మార్గదర్శకత్వం చేయడం ద్వారా పేదరికం నుంచి బయటపడేలా చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం అమలులో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. ప్రతి 30 నుంచి 50 అత్యంత పేద కుటుంబాలకు ఒక కోచ్‌ను నియమించి, వారి ద్వారా ఆయా కుటుంబాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిపిఓ శ్రీకాంత్, డిఆర్డిఓ ముషాహిదా బేగం, ఏపీడి శ్రీనివాస్ పాల్గొన్నారు.






