గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

by Batti.Sumithra |

వచ్చే ఏడాది జూన్, జూలై మాసాల్లో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు.

గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వచ్చే ఏడాది జూన్, జూలై మాసాల్లో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్ల పై సంబంధిత శాఖల అధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర కన్సల్టెంట్ కుహూ గుప్తాతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన తుంగిని, పోచంపాడ్, తడ్ పాకల్ పుష్కర ప్రదేశాల వద్ద చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన వసతుల పై చర్చించారు. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ తో కూడిన పోచంపాడ్ పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాల పార్కింగ్, సరైన రోడ్డు వసతి, అత్యవసర ఎగ్జిట్ వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

తడ్ పాకల్, తుంగిని పుష్కరఘాట్ల వద్ద కూడా అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తేవాలన్నారు. పుష్కర ఘాట్ల వరకు అప్రోచ్ రోడ్లు, పుష్కర ఘాట్ల మరమ్మతులు వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నిర్దేశిత పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఇప్పటికే ఆమోదం తెలిపిన పనులు వెంటనే ప్రారంభం అయ్యేలా చూడాలని, అవసరమైన కొత్త పనులను గుర్తిస్తూ ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎండోమెంట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story