- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాట్ ఎయిర్ బెలూన్ ల్యాండింగ్‌పై తప్పుడు ప్రచారం వద్దు.. నిర్వాహకుల రిక్వెస్ట్
తెలంగాణ అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌లో భాగంగా శనివారం ఉదయం జరిగిన బెలూన్ ల్యాండింగ్‌పై మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిర్వాహకులు ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్(Telangana International Hot Air Balloon Festival)లో భాగంగా శనివారం ఉదయం జరిగిన బెలూన్ ల్యాండింగ్‌పై మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం మొత్తం 18 హాట్ ఎయిర్ బెలూన్‌లు డీజీసీఏ (DGCA) నిబంధనలకు అనుగుణంగా గాలిలోకి ఎగిరాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే ఇవన్నీ సురక్షితంగా ప్రయాణించి నిర్ణీత ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయి. అయితే, ఒక బెలూన్ చెరువులో దిగిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఓ బెలూన్ ఉదయం 8 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని.. ప్రయాణికులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా బెలూన్ చెరువులో దిగలేదని, అది సాధారణ ల్యాండింగ్ మాత్రమేనని వివరించారు. బెలూన్‌లో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని, భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురుకాలేదని స్పష్టం చేశారు.
తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు
హాట్ ఎయిర్ బెలూన్‌లకు విమానాల మాదిరిగా రన్‌వేలు, ముందుగా నిర్ణయించిన ల్యాండింగ్ పాయింట్లు ఉండవని, ఇవి గాలి వీచే దిశను బట్టి ప్రయాణిస్తాయని, పైలట్లు తమ అనుభవంతో సురక్షితమైన ఖాళీ ప్రదేశాలను చూసుకుని ల్యాండ్ చేస్తారని వివరించారు. ఇది అంతర్జాతీయంగా అమల్లో ఉన్న విధానమే" అని నిర్వాహకులు పేర్కొన్నారు. అనుభవం ఉన్న పైలట్లు, రిజిస్టర్డ్ బెలూన్లతోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని వారు కోరారు.






