జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ విస్తరణ.. కొడిమ్యాల, గొల్లపల్లి నేతలకు కీలక పదవులు

by Jakkula.Mamatha |

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని విస్తరిస్తూ పలువురు నాయకులకు జిల్లా స్థాయి బాధ్యతలను పార్టీ అధిష్ఠానం అప్పగించింది.

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ విస్తరణ.. కొడిమ్యాల, గొల్లపల్లి నేతలకు కీలక పదవులు
X

దిశ, కొడిమ్యాల/గొల్లపల్లి: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని విస్తరిస్తూ పలువురు నాయకులకు జిల్లా స్థాయి బాధ్యతలను పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఈ విస్తరణలో కొడిమ్యాల, గొల్లపల్లి మండలాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యత దక్కడం స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కొడిమ్యాల మండలానికి చెందిన చిలువేరి నారాయణ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, మ్యాకల మల్లేశంను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే గొల్లపల్లి మండలానికి చెందిన ముస్కు నిశాంత్ రెడ్డిని జిల్లా ఉపాధ్యక్షుడిగా, దిలీప్, విజయ్‌లను జిల్లా కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నూతనంగా నియమితులైన నాయకులు తెలిపారు. వారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

Next Story