- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎగ్జిట్ పోల్స్.. ఐదు కార్పొరేషన్లలో అధికార పార్టీదే పైచేయి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించనుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించనుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో రెండింటిలో హస్తం పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించనుందని సర్వే సంస్థలు ప్రకటించాయి.
మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరువాత బీఆర్‌ఎస్ నిలుస్తుందని, కార్పొరేషన్‌లలో మాత్రం బీజేపీ ముందుంటుందని తెలిపింది. బుధవారం పోలింగ్అనంతరం రెండు సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. రెండు కూడా ఐదు కార్పొరేషన్‌లలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ప్రకటించాయి. నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించనుందని తెలిపాయి.
నిజామాబాద్‌లో ఎంఐఎం కీలకం..
పీపుల్స్‌పల్స్ సంస్థ నిజామాబాద్ మినహా మిగిలిన వాటిల్లో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించనుందని తెలిపింది. కరీంనగర్‌లో మాత్రం ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ నిలుస్తుందని వెల్లడించింది. మున్సిపాలిటీల్లో అత్యధికంగా కాంగ్రెస్‌పార్టీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది.
అలాగే పల్స్ టుడే సంస్థ ఏడు కార్పొరేషన్‌లలో ఐదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకోనుందని తెలిపింది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్‌లలో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించనుందని, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని వెల్లడించింది. మరోవైపు కరీంనగర్‌లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ రెండో స్థానం, నిజామాబాద్‌లో మాత్రం ఎంఐఎం రెండో స్థానంలో నిలుస్తుందని ఈ సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.






