గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ.. కాసేపట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-22 04:59:21  IST  )

గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ.. కాసేపట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు, నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ మరికాసేపట్లో తన తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుపై అటు విధుల్లో చేరిన 562 మంది అభ్యర్థులతో పాటు, ఇటు నియామక ప్రక్రియను సవాల్ చేసిన ఇతర అభ్యర్థుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా, గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమలులో లోపాలు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్, గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా, జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించి, ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసింది. అయితే, ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల నియామకాలు సుస్థిరం అవుతాయా..? మూల్యాంకనం, బయోమెట్రిక్ ఓఎంఆర్ షీట్లపై వచ్చిన ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా అనే విషయం 562 మంది గ్రూప్-2 అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడి ఉంది.

Read More..

Group-1: గ్రూప్ -1 పై జనవరి 22న హైకోర్టు తీర్పు

Next Story