Group-1: గ్రూప్ -1 పై జనవరి 22న హైకోర్టు తీర్పు

by Prasad Jukanti |

తెలంగాణ గ్రూప్-1 వివాదంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి

Group-1: గ్రూప్ -1 పై జనవరి 22న హైకోర్టు తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రూప్ -1 సెలక్షన్ లిస్టుపై జనవరి 22న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ ఏడాది మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంగింక్స్ లిస్ట్, మార్కుల జాబితాలో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఈ జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్లింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ అంశంలో ఇరు పక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్ జనవరి 22వ తేదీన తీర్పు వెలువరించనుంది.

Next Story