పురాతన వేణుగోపాల స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు.. ఆలస్యంగా వెలుగులోకి!?

by Jakkula.Mamatha |

కాకతీయులు నిర్మించిన కూసుమంచి శివాలయానికి సమీపంలో ఉన్న పూజలు, ఆరాధన లేనటువంటి పురాతన వేణుగోపాలస్వామి ఆలయంలో గత పది రోజుల క్రితం ఆలయానికి సమీపంగా వ్యవసాయ క్షేత్రాలు గల కొందరు కలిసి గుప్త నిధులు వెలికి తీసే సిద్ధాంతి తో కలిసి ఒక నాలుగు రోజుల పాటు గుప్త నిధుల తవ్వకం చేపట్టినట్లు తెలిసింది.

పురాతన వేణుగోపాల స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు.. ఆలస్యంగా వెలుగులోకి!?
X

దిశ,కూసుమంచి: కాకతీయులు నిర్మించిన కూసుమంచి శివాలయానికి సమీపంలో ఉన్న పూజలు, ఆరాధన లేనటువంటి పురాతన వేణుగోపాలస్వామి ఆలయంలో గత పది రోజుల క్రితం ఆలయానికి సమీపంగా వ్యవసాయ క్షేత్రాలు గల కొందరు కలిసి గుప్త నిధులు వెలికి తీసే సిద్ధాంతితో కలిసి ఒక నాలుగు రోజుల పాటు గుప్త నిధుల తవ్వకం చేపట్టినట్లు తెలిసింది. కాగా మూడు రోజుల పాటు తవ్విన అనంతరం నాల్గవ నాడు ఆలయానికి సమీపంలో ఇల్లు కలిగిన యువకుడు రాత్రి పూట జరిగే తంతును గమనించి భూమి యజమానికి సమాచారం అందించగా సదరు భూ యజమాని గ్రామంలో కొంతమంది యువకులను తీసుకుని అక్కడికి వెళ్లి తవ్వకాలను పరిశీలించే క్రమంలో అక్కడ ఉన్న సిద్ధాంతి తో పాటు వారి వెంట వచ్చిన వారు పరారైనట్లు తెలిసింది.

అంతకు ముందే మూడు నాలుగు రోజులు భారీ స్థాయిలో తవ్వకాలు జరిగినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలంలో భారీ స్థాయిలో సుమారు నాలుగు ఐదు ట్రాక్టర్ల మట్టి తవ్వినట్లు కనిపిస్తుంది. తవ్వకాల్లో కొంత బంగారం దొరికినట్లు స్థానికులు, గ్రామస్తులలో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. కాగా భూమి కౌలుకి తీసుకున్న వ్యక్తి, భూయజమానికీ మధ్య కొంతమంది పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దొరికిన బంగారాన్ని ఒక మాజీ నగల దుకాణం యజమాని సహాయంతో కోదాడ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో కరిగించి అమ్మినట్లు గ్రామంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా గ్రామం మొత్తం గుప్త నిధుల తవ్వాకాలపై రకరకాల పుకార్లు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. కాగా జరిగిన ఘటన పై ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. కాగా గ్రామంలో ఆ నోట, ఈ నోట పుకార్ల ద్వారా గుప్త నిధుల తవ్వకాల వార్త హల్చల్ చేస్తుంది.

Next Story