పిచ్చి కుక్క స్వైర విహారం, 9 మందికి గాయాలు

by velandi.Saikiran |

బట్టపెల్లి పోతారం గ్రామంలో అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న 9 మందిపై ఒక్కసారిగా ఓ పిచ్చి కుక్క దాడి చేసింది.

పిచ్చి కుక్క స్వైర విహారం, 9 మందికి గాయాలు
X

దిశ, జగిత్యాల రూరల్ : సారంగాపూర్ మండలం బట్టపెల్లి పోతారం గ్రామంలో అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న 9 మందిపై ఒక్కసారిగా ఓ పిచ్చి కుక్క దాడి చేసింది. ఆరు బయట నిద్రిస్తున్న ప్రేమ లత, నర్సవ్వ, వెంకటమ్మ, బీమవ్వ, ఎల్లయ్య, లక్ష్మి, శ్రీనివాస్, మల్లవ్వ, శ్రీకాంత్ ల పై పిచ్చి కుక్క దాడికి పాల్ప‌డింది. దీంతో వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్క బారీన ప‌డ్డ బాధితుల‌ను పరామర్శించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కుక్క‌ల ప‌ట్ల‌ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు

Next Story