ఆగస్టు, సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయని భావిస్తోంది..

ఆగస్టు, సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election)కు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు(August), సెప్టెంబర్‌(September)లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఇందులో భాగంగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఎన్నికల ప్రక్రియ విధానంపై ఇప్పటికే నేతలు, కార్యకర్తలకు సూచనలు చేసింది. ఎన్నికలను బలంగా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని తెలిపింది.

నేతలు, కార్యకర్తలకు కీలక సూచనలు


ఈ నేపధ్యంలో రాయచోటి పార్టీ నేతలు, కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. తమ వెనుక మంత్రి నారా లోకేశ్ ఉన్నారని, రాబోయే కాలానికి ఆయన బలమైన నాయకుడని మంత్రి మండిపల్లి దీమా వ్యక్తం చేశారు. రాయచోటిని ఇప్పటివరకూ అభివృద్ధి చేశామని, రాబోయే కాలంలో మరింతగా చేస్తామన్నారు. తాను మంత్రి అయి రెండేళ్లవుతోందని, చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించాలని రాయచోటి ప్రజలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కోరారు.

Next Story