- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొయినాబాద్ ఫాంహౌస్ కేసు... రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
మొయినాబాద్‌లోని ఫాంహౌస్ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. రోహిత్ రెడ్డి ఫాంహౌసులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు, ఈగల్ టీమ్ సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ఫాంహౌస్ లోపల గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరగడం సంచలనానికి దారితీసింది. వెంటనే పోలీసులు ఫాంహౌస్‌ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టి, లోపల ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రియల్టర్ నిబిద్ శర్మ, రితేష్ రెడ్డి, రమేష్, శ్రవణ్, విజయ కృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
అనంతరం పోలీసులు వారి రక్త నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపగా.. పైలట్ రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం మరింత సంచలనానికి దారి తీసింది. అయితే వీరిలో ఏపీ ఎంపీ పుట్టా మహేష్ కు మాత్రం నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఫాంహౌస్‌లో సోదాలు తనిఖీలు జరుగుతున్న సమయంలో కాల్పులు జరగడంపై.. అక్కడ ఉన్న బాడీగార్డ్ లేదా గన్ మెన్ ఈ కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలి నుంచి ఒక లైసెన్స్‌డ్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి? ఎవరిని భయపెట్టడానికి ఇవి జరిగాయి? అనే కోణంలో ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.
భారీగా పొలిసు బలగాల మోహరింపు
అలాగే ఫాంహౌస్‌లోకి గత 24 గంటల్లో ఎవరెవరు వచ్చారు? ఏయే వాహనాలు లోపలికి వెళ్లాయి? అనే వివరాల కోసం సీసీటీవీ ఫుటేజీ డీవీఆర్ ను సీజ్ చేశారు. దొరికిన 2 గ్రాముల కొకైన్ కేవలం నమూనా మాత్రమేనా లేక పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్ ఏదైనా ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఫాంహౌస్ యజమానిగా మాజీ ఎమ్మెల్యేకు ఇందులో ఎంతవరకు ప్రమేయం ఉందనేది విచారణలో తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొయినాబాద్ లో భారీగా పోలీసులను మోహరించారు.






