- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాంపల్లి అగ్నిప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాదులోని నాంపల్లిలో ఓ ఫర్నీచర్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఆదివారం ఉదయం వరకు మంటలు కొనసాగాయి.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాదులోని నాంపల్లిలో ఓ ఫర్నీచర్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఆదివారం ఉదయం వరకు మంటలు కొనసాగాయి. అనంతరం రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సెల్లార్‌లో ఉన్న ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని వాచ్‌మెన్ బేబీ (43), అఖిల్ (12), ప్రణీత్ (9), మహ్మద్ ఇంతియాజ్ (27), హబీబ్ (40)గా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పందించి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఒక వృద్ధురాలి తో సహా మొత్తం ఐదుగురు మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (5 lakh ex-gratia) ప్రకటించారు.
బాధితులకు తక్షణ సహాయం అందించాలని, ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందనను మంత్రి ఆదేశించారు. అలాగే పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు తేలిందని మంత్రి స్పష్టం చేశారు. సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ సామాగ్రిని నిల్వ చేయడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని, ఇప్పటికే ఈ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
READ MORE ....






