- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 2026 మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రధాన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య పలు చోట్ల ఎక్కువగా ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్లం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 25,62,639 మంది ఉండగా, మహిళా ఓటర్లు 26,80,014 మంది, ట్రాన్స్‌జెండర్లు 640 మంది ఉన్నారు.
అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో..
తాజాగా, ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల్లో అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 వార్డులలో అత్యధికంగా 3,48, 051 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 వార్డులతో మొత్తం 3,40,580 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,69,679 మంది కాగా, మహిళలు 1,70,858 మంది ఉన్నారు. ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు.
అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో..
అత్యధిక ఓటర్లు ఉన్న మున్సిపాలిటీ జాబితా సూర్యాపేట నిలిచింది. అక్కడ 1,08,848 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 56,664 మంది మహిళలు ఉండటం విశేషం. ఇక అత్యల్పంగా అమరచింత మున్సిపాలిటీలో 9,147 ఓట్లు ఉన్నాయి.
కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 12న తుది జాబితా ప్రచురణ పూర్తయిన నేపథ్యంలో జనవరి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం ఇతర ప్రధాన పార్టీల నేతలు ఈనెల 16 నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. మరోవైపు ఓటర్లు తమ పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.






