సమాజ పరిరక్షణ బాధ్యత అందరూ తీసుకోవాలి : సీఐ పవన్ కుమార్

by Batti.Sumithra |

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని మరిపెడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ సూచించారు.

సమాజ పరిరక్షణ బాధ్యత అందరూ తీసుకోవాలి : సీఐ పవన్ కుమార్
X

దిశ, మరిపెడ : ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని మరిపెడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ సూచించారు. శనివారం మరిపెడ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శబరీష్ నేతృత్వంలో జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. గంజాయి నివారణ కోసం పోలీసు శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే మరిపెడ సర్కిల్ పరిధిలో గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కిట్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

ఇక పై అనుమానిత వ్యక్తులను సంఘటనా స్థలంలోనే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువత పెడదారి పట్టకుండా ఫోర్త్ ఎస్టేట్ పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు, నిషేధిత మత్తు పదార్థాల రవాణా, నకిలీ వస్తువుల విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో యువత పెడదారి పట్టకుండా, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండేందుకు అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచి, క్రీడలు మరియు విద్య పట్ల ఆసక్తి పెంపొందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వో గండ్రాతి సతీష్, అదనపు ఎస్‌ఐ మహబూబ్ అలీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story