సిట్‌లతో అందరూ సిట్‌రైట్ అయితుండ్రు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-21 14:28:36  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను రోజురోజులు సీరియల్ నడుపకుండా తొందరగా పూర్తి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

సిట్‌లతో అందరూ సిట్‌రైట్ అయితుండ్రు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ విచారణను రోజురోజులు సీరియల్ నడుపకుండా తొందరగా పూర్తి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అన్నారు. ఇవాళ ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలిగేలా సిట్ పని చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను త్వరగా పూర్తి చేసి దోషులను శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చొబెట్టాలని కామెంట్ చేశారు. మొదటి సిట్, రెండో సిట్ అంటూ కాలయాపన చేస్తుంటే ఎక్కడోళ్లు అక్కడ సిట్‌రైట్ అవుతున్నారని సెటైర్లు వేశారు. రానున్న రోజుల్లో మూడు రంగుల జెండా.. గులాబీ జెండా అయితదని, లేక గులాబీ జెండానే మూడు రంగుల జెండాగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీ, ఫోన్ ట్యాపింగ్‌ కేసు ఇన్వెస్టిగేషన్ సిట్ హెడ్ సజ్జనార్‌ తమ మెదక్ జిల్లాలో పని చేసి వెళ్లారని, ఆయనకు మంచి పేరు ఉందన్నారు. ఆ పేరును నిలబెట్టుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను త్వరగా పూర్తి చేయాలని రఘునందన్ రావు అన్నారు.

Next Story