- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌కు అండ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి అర్హుడికి చేరేలా వార్డు కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని ఇల్లెందు మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొళ్ళ సూర్యం అన్నారు.

దిశ, ఇల్లెందు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి అర్హుడికి చేరేలా వార్డు కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని ఇల్లెందు మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొళ్ళ సూర్యం అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచనల మేరకు కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్ ఆధ్వర్యంలో వార్డు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డులో నెలకొనే సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ డానియల్, కౌన్సిలర్ జాఫర్, సహనామినేటెడ్ సభ్యులు మడుగు సాంబమూర్తి, పర్రె స్వర్ణలత, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప, మహిళా నాయకురాలు పెద్దబోయిన శ్వేత, కాంగ్రెస్ నాయకులు మహబూబ్, లక్ష్మీనారాయణ, ఆలేటి చిన్ని, ఝాన్సీ, సతీష్ కుమార్ పాసి, మాదాసు సుమన్, పొట్ల శ్రీను, చైతన్య, గంటాడి విజయ్, భరత్, ప్రసాద్, నాయిని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






