- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు ప్రతి ఓటరూ సహకరించాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా పాల్గొని ఎన్నికల సంఘానికి సహకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు.

దిశ, రాజేంద్రనగర్ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా పాల్గొని ఎన్నికల సంఘానికి సహకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. బీఎల్‌వోలు ఓటర్లకు అందజేస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి ఓటరు తమ పరిధిలోని బీఎల్‌వోలను సంప్రదించి ఎన్యుమరేషన్ ఫారాన్ని సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి అర్హత కలిగిన ఓటరికి తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనంజయ్, ప్రేమ్ గౌడ్, సరికొండ వెంకటేష్, సోమ శ్రీనివాస్ గుప్తా, కాశిగారి యాదగిరి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.






