సమస్యల పరిష్కారానికి కృషి.. పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్

by Web Desk |
సమస్యల పరిష్కారానికి కృషి.. పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్
X

దిశ, పటాన్‌చెరు: కాలనీలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భారతీ నగర్ కార్పొరేటర్ వెన్నవరం సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు. బస్తీ దర్శన్‌లో భాగంగా భారతీ నగర్ డివిజన్‌లోని ఎల్ఐజి, మ్యాక్ సొసైటీ కాలనీల్లో కార్పొరేటర్ పర్యటించారు. ఎల్ఐజి కాలనీలో బల్దియా, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పర్యటిస్తూ.. ఈఎస్ఐ రోడ్డులో చెత్త, దేబ్రెస్ నివారణకు దాదాపు 14.5 లక్షలతో చేపడుతున్న చైన్ లింక్ మెష్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు.

అనంతరం ఎల్ఐజి కాలనీలో వాటర్ డ్రైన్ పనులకు సమస్య ఉందని తెలిసి కాలనీ వాసులకు ఇబ్బంది కాకుండా పని చేయాలని కాంట్రాక్టర్‌కు చెప్పారు. బస్తీ దర్శన్‌లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ డీఈ శిరీష, ఏఈ చంద్రశేఖర్, ఎల్ఐజి సొసైటీ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి, లక్ష్మణ్, రాఘవ చారీ, విఠల్, కుతుబద్దీన్, కొండల్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed