ఈ ఆకులు అమృతంతో సమానం.. ఒక్కసారి వీటిని తీసుకుంటే.. ఆ రోగాలు మాయం

by Disha Web Desk 10 |
ఈ ఆకులు అమృతంతో సమానం.. ఒక్కసారి వీటిని తీసుకుంటే.. ఆ రోగాలు మాయం
X

దిశ, ఫీచర్స్: ఆధునిక జీవనశైలి వల్ల చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా, అధిక రక్తంలో చక్కెర స్థాయి కళ్ళు, గుండె, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సేజ్ ఆకులను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సేజ్ ఆకులను ప్రధానంగా ఆసియా, గల్ఫ్ దేశాలలో ఉపయోగిస్తారు. ప్రత్యేకమైన సువాసన కారణంగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆకులను సాస్‌లు, ఫిల్లింగ్‌లు, సూప్‌లు, వంటలలో కలుపుతారు.

శతాబ్దాలుగా సేజ్ ఆకులను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ సేజ్ ఆకుల ధర చాలా ఎక్కువ. వీటిని తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాకుండా, మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. కానీ, మీరు మీ వైద్యుడిని సంప్రదించి దానిని తీసుకోవాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఆకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. ఈ ఆకులు చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తాయి. వీటి ఆకులతో చేసిన హెర్బల్ టీ గొంతు నొప్పి, దగ్గును తగ్గిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story