ఆ కారణంగా 11 మంది రిజెక్ట్ చేసిన అమ్మాయి.. తననే సన్నీ లియోన్ దత్తత తీసుకోవడంతో నెట్టింట ప్రశంసల జల్లు!

by Kavitha |
ఆ కారణంగా 11 మంది రిజెక్ట్ చేసిన అమ్మాయి.. తననే సన్నీ లియోన్ దత్తత తీసుకోవడంతో నెట్టింట ప్రశంసల జల్లు!
X

దిశ,సినిమా: సన్నిలియోన్ 1981 మే13న కెనడాలో జన్మించింది. ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈ బ్యూటీ హాలివుడ్ నీలిచిత్రాలలో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. జిస్మ్ 2 అనే బాలీవుడ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటిసారిగా తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ మూవీలో నటించింది. ప్రస్తుతం కండోమ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది.

ఈమెకి ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారనటంలో అతియోశక్తి లేదు. ఈమె డేనియల్ వేబర్ అనే గిటారిస్ట్ ని పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం ఈమెకి సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అనాధ ఆశ్రమంలో ఉన్న ఒక అమ్మాయిని ఆమె రంగు కారణంగా 11 మంది కుటుంబాలు దత్తత తీసుకోలేదు. కానీ సన్నిలియోన్ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో ఆమె చేసిన పనికి అభిమానులు పొగడ్తలతో ముంచేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story