- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇష్టం లేకపోయినా నేనేంటో నిరూపించుకోవాలని పొట్టి బట్టలు వేసుకున్నా: నోరా ఫతేహి
బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi) ‘దిల్బర్ దిల్బర్’ అనే సాంగ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi) ‘దిల్బర్ దిల్బర్’ అనే సాంగ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాటలోని నోరా స్టెప్స్‌కు నేటితరం కుర్రాళ్లు ఫిదా అవ్వని వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మడు తెలుగులోనూ పలు చిత్రాల్లోని స్పెషల్ సాంగ్స్ చేసి అందరినీ మైమరిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరా ఫతేహి(Nora Fatehi) ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘వాళ్ళిచ్చిన జాకెట్ చాలా చిన్నగా ఉంది. నాకు ఏమాత్రం నచ్చలేదు. నన్ను మరీ అంత సెక్సువలైజ్ చేసి చూపించకండి వారికి చెప్పాను.
చేసేది సెక్సీ సాంగే అయినా మరీ అసభ్యకరంగా ఉండొద్దని కోరాను. ఇంత చిన్న బట్టలు వేసుకోలేను.. ఇంకేమైనా ఇవ్వండని అడిగాను. తర్వాత రోజు మరో బ్లౌజ్ రెడీ చేశారు. అది కూడా చిన్నగానే అనిపించింది. కానీ నాకు వాళ్ళు ముందు ఇచ్చిన దానికంటే అది ఎంతో మెరుగ్గా ఉంది. నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఇష్టం లేకపోయినా కానీ ఆ పొట్టి డ్రెస్(short dress) వేసుకుని దిల్బర్ సాంగ్ చేశాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ నోరా ఫతేహి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More..
తస్సాదియ్యా.. సెగలు పుట్టిస్తోన్న సీరియల్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ పిక్స్






