EU Ban On Russian Coal: రష్యాపై సరికొత్త ఆంక్షలు.. అది కూడా బ్యాన్ చేసిన ఈయూ

by Dishafeatures2 |
EU Ban On Russian Coal: రష్యాపై సరికొత్త ఆంక్షలు.. అది కూడా బ్యాన్ చేసిన ఈయూ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ప్రపంచమంతా పుతిన్‌కు వ్యతిరేకం అయింది. ఉక్రెయిన్‌పై దాడులను ఉపసంహరించుకోవాలంటూ ప్రపంచ దేశాలు హితవు పలికాయి. కానీ రష్యా వినకుండా తన దాడులకు కొనసాగించించింది. దాంతో ప్రపంచ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా అనేక దేశాలు రష్యా నుంచి వచ్చే దిగుమతులను, రష్యాకు పంపే ఎగుమతులను నిలిపివేశాయి. మరికొన్ని దేశాలు రష్యా బిలియనీర్స్‌, అంబాసిడర్స్, రష్యన్ల వ్యాపారాలపై బ్యాన్ విధించాయి. అంతేకాకుండా రష్యాకు సంబంధించిన విమానాలను తమ ఆకాశ మార్గాన్ని సైతం కొన్ని దేశాలు మూసివేసినట్లు ప్రకటించాయి.

అయితే తాజాగా రష్యాపై పలు దేశాలు సరికొత్త ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. రష్యాపై సరికొత్త ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. 'రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో ఒకరి పక్షం తీసుకోవడం కేవలం ఈయూ కోసమే కాదు యావత్ ప్రపంచానికి కీలకం. ఇందులో భాగంగా రష్యా నుంచి దిగుమతి అయ్యే బొగ్గుపై నిషేధం విధిస్తున్నాం' అని ఆమె తెలిపారు.


Next Story

Most Viewed