Eatala Rajendar : చట్టంతో ఎవరు చెలగాటమాడినా ఇదే గతి.. హరీశ్ విచారణపై ఈటల హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-20 11:14:56  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)‌ను ఇవాళ సిట్ విచారిస్తున్న విషయం తెలిసిందే.

Eatala Rajendar : చట్టంతో ఎవరు చెలగాటమాడినా ఇదే గతి.. హరీశ్ విచారణపై ఈటల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)‌ను ఇవాళ సిట్ విచారిస్తున్న విషయం తెలిసిందే. మూడున్నర గంటలకు పైగా మొదటి దశ విచారణ కొనసాగగా.. భోజన విరామం తర్వాత విచారణ పున:ప్రారంభమైంది. మరోవైపు జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హరీశ్ రావు వెంట లోనికి అడ్వొకేట్లను అనుమతించలేదని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హరీశ్‌రావు సిట్ ఎదుట విచారణకు హాజరుకావడంపై తాజాగా మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ నగరంలో ఓ కార్యక్రమానికిి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు దోషులు ఎవరో తేల్చాలని అన్నారు. కేసులో దర్యాపు చేయడం తప్పు కాదని.. కానీ, నిజాయితీగా విచారణ జరపాలని పేర్కొన్నారు. చట్టంతో ఎవరు చెలగాటమాడినా.. ఇదే గతి పడుతుందనే విశ్వాసం ప్రజలకు కల్పించాలని అన్నారు.

Read More... Phone Tapping Case : నెక్స్ట్ కేసీఆర్‍కు నోటీసులు?.. కేటీఆర్ రియాక్షన్ ఇదే

Next Story