స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా.. '#69 సంస్కార్ కాలనీ'పై ఎస్తర్ నోరోన్హా

by Disha Web Desk 17 |
స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా.. #69 సంస్కార్ కాలనీపై ఎస్తర్ నోరోన్హా
X

దిశ, సినిమా: రిస్వి తిమ్మరాజు, అజయ్, ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం '#69 సంస్కార్ కాలనీ'. ఈ చిత్రం మార్చి 18న విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ ఎస్తర్ నోరోన్హా తాజాగా మీడియాతో ముచ్చటించారు. 'క్లాసికల్ సింగర్‌గా కేరిర్ ప్రారంభించిన నేను సినిమాల్లోకి వస్తాననుకోలేదు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వల్లే ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాను. తేజ గారి 'వెయ్యి అబద్ధాలు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవగా.. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా తిరస్కరించాను. కానీ, ఈ '#69 సంస్కార్ కాలనీ' సినిమా కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఇందులో సాధారణ హౌస్ వైఫ్ వైశాలిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాను. నేటి తరం కుర్రాళ్లకు ఈ క్యారెక్టర్ ఎంతో నచ్చుతుంది' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్న నటి.. ప్రస్తుతం తెలుగులో 'ఐరావతం'తో పాటు జీ5 సమర్పణలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ '#69 సంస్కార్ కాలనీ' చిత్రాన్ని లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా నిర్మించగా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు.





Next Story

Most Viewed