MP Arvind: ఎంపీ అర్వింద్‌ను అడ్డుకున్న ఎర్దండి గ్రామస్తులు (వీడియో)

by Disha Web Desk 2 |
MP Arvind: ఎంపీ అర్వింద్‌ను అడ్డుకున్న ఎర్దండి గ్రామస్తులు (వీడియో)
X

దిశ, ఇబ్రహీంపట్నం: Erdandi Villagers Stopped MP Arvind| జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో భారీగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో ముంపునకు గురైన గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కారుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే, గతేడాది మల్లన్న గుట్ట భూమి విషయమై గ్రామ కుల సంఘాలు కలిసి ఎంపీని వేడుకున్నా.. పట్టించుకోలేదని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వచ్చావని గ్రామస్తులు నిలదీశారు. ఓట్ల కోసం చేతులు జోడించి మొక్కే బూటకపు రాజకీయాలకు ఈ గ్రామం స్వస్తి పలుకుతుందని సీరియస్ అయ్యారు. ముంపునకు గురైన మా గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుని మాకు న్యాయం చేయాలని, వివాదంలో ఉన్న మల్లన్నగుట్ట భూమి మాకు చెందే వరకు మా పోరాటం ఆగదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed