డిసెంబర్‌లో 16 శాతం పెరిగిన ఈపీఎఫ్ఓ చందాదారుల చేరిక!

by Web Desk |
డిసెంబర్‌లో 16 శాతం పెరిగిన ఈపీఎఫ్ఓ చందాదారుల చేరిక!
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది డిసెంబర్ ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ)లో 14.6 లక్షల మంది చందాదారులు చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే 16.4 శాతం అధికమని పేర్కొంది. ఆదివారం విడుదలైన ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం.. 2021, నవంబర్ నెలతో పోల్చినా కూడా సమీక్షించిన నెలలో 19.98 శాతం మంది చందాదారులు పెరిగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిసెంబర్ నెలలో ఈపీఎఫ్‌లో చేరిన 14.60 లక్షల మంది సబ్‌స్క్రైబర్లలో 9.11 లక్షల మంది కొత్త సభ్యులు మొదటిసారి ఈపీఎఫ్ చట్టం కింద నమోదు చేయబడ్డారు.

తాజా గణాంకాల ప్రకారం.. 22-25 ఏళ్ల వయసు వారు అత్యధికంగా 3.87 లక్షల మంది ఎన్‌రోల్ చేసుకోగా, 18-21 ఏళ్ల వయసు వారు దాదాపు 2.97 లక్షల మంది ఎన్‌రోల్ చేసుకున్నారు. మొత్తం చందాదారుల్లో 3 లక్షల మంది మహిళలు ఈపీఎఫ్ఓ లో చేరారు. దీంతో 2021, డిసెంబర్ నాటికి మొత్తం మహిళా సబ్‌స్క్రైబర్ల వాటా 20.52 శాతానికి చేరిందని గణాంకాలు పేర్కొన్నాయి. పరిశ్రమల వారీగా.. నిర్మాణ, నిర్మాణ పరిశ్రమలు, టెక్స్‌టైల్స్, రెస్టారెంట్లు, ఇనుము, ఉక్కు మొదలైన పరిశ్రమల నుంచి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోందని మంత్రిత్వ శాఖ వివరించింది.


Next Story

Most Viewed