ఈపీఎఫ్ఓ కొత్త పింఛన్ పథకం!

by Web Desk |
ఈపీఎఫ్ఓ కొత్త పింఛన్ పథకం!
X

దిశ, వెబ్‌డెస్క్: రిటైర్మెంట్ ఫండ్ బాడీ(ఈపీఎఫ్ఓ) సంఘటిత కార్మికుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. నెలకు రూ. 15,000 కంటే ఎక్కువ బేసిక్ జీతం ఉన్న వారికి ఈ పథకం వర్తించనుంది. ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాలేని వారికి ఈ పథకం ఉపయోగపడేలా దీన్ని రూపొందించనున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మార్చి నెలలో జరగబోయే ఈపీఎఫ్ఓ ఉన్నతస్థాయి కమిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ పథకం పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఈపీఎఫ్ఓలో ఎక్కువగా జమ చేసే ఉద్యోగులకు ఎక్కువ పెన్షన్ రావాలనే డిమాండ్ వినిపిస్తోంది. రూ. 15 కంటే ఎక్కువ వేతనం ఉన్నప్పటికీ దానిపై 8.33 శాతం మాత్రమే ఈపీఎఫ్ఓ కింద జమ చేయవచ్చు. దీనివల్ల పెన్షన్ తక్కువగా వస్తుంది. ఈ విధానంలో మార్పులు చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నెలకు రూ. 15 వేల వరకు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో జమ వేయాలి. కానీ ధరల పెరుగుదల, వేతన సవరణ అంశాలను దృష్టిలో ఉంచుకు ఈపీఎఫ్ఓ కనీస వేతనాన్ని రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు మార్చారు. ప్రస్తుత దీన్ని రూ. 25,000 చేయాలని డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే, ఈ స్థాయిలో పెంపు ఉండే అవకాశాల్లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బేసిక్ జీతం పరిమితి 2014లో రూ. 15 వేలకు సవరించారు.


Next Story

Most Viewed