- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీడ్ బాల్స్‌తో పర్యావరణ పరిరక్షణ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి అన్నారు.

దిశ, కామారెడ్డి టౌన్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి అన్నారు. పాఠశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా తయారు చేసిన సీడ్ బాల్స్‌ను ఆదివారం ఆమె పరిశీలించారు.
వర్షాల తర్వాత చల్లేందుకు సిద్ధం..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాత అనువైన ప్రదేశాల్లో సీడ్ బాల్స్ చల్లడం ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి శ్రీకారం చుడతామని తెలిపారు. విద్యార్థినుల్లో ప్రకృతి పరిరక్షణ పై బాధ్యతాయుతమైన ఆలోచన పెంపొందించడంతో పాటు పచ్చదనం విస్తరణకు వారిని భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, వృక్షారోపణ ప్రాధాన్యం పై విద్యార్థినులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. సృజనాత్మకంగా సీడ్ బాల్స్‌ను రూపొందించిన విద్యార్థినులు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ మాధవి అభినందించారు.






