- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాల విద్యార్థుల భద్రతే లక్ష్యం.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్
పాఠశాల విద్యార్థుల రహదారి భద్రతను మరింత మెరుగుపరచే లక్ష్యంతో మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిశ, చంపాపేట్: పాఠశాల విద్యార్థుల రహదారి భద్రతను మరింత మెరుగుపరచే లక్ష్యంతో మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్రాయణగుట్ట డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ) చంద్రకుమార్ గడ్డిఅన్నారం ప్రత్యేక డ్రైవ్ పాయింట్‌ను సందర్శించి తనిఖీలను పరిశీలించారు. ఏసీపీ ఆదేశాల మేరకు మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం, శాలివాహన నగర్ ప్రాంతాల్లో ఈ-బైక్స్(EIBs), ఆటోరిక్షాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వాహనాల పత్రాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తూ ఉల్లంఘనలకు పాల్పడిన డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.
అలాగే ఈ-బైక్ డ్రైవర్లకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రహదారులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు డ్రైవర్లకు సూచించారు. పాఠశాలలు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల రక్షణకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.






