- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసముద్రంలో సెంట్రల్ డివైడర్‌పై వివాదం.. విచారణ కోరుతున్న ప్రజలు
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ లైటింగ్ డివైడర్‌పై స్థానిక ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

దిశ,కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ లైటింగ్ డివైడర్‌పై స్థానిక ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రహదారి మధ్యలో ఏర్పాటు చేయాల్సిన డివైడర్ ఒక వైపుకు సుమారు 1.5 అడుగుల మేరకు జరిగినట్లు కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డివైడర్ ఎస్బీఐ బ్యాంకు వైపు మళ్లినట్లు కనిపిస్తోందని, ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. డివైడర్ నిర్మాణం ఆమోదిత ప్రణాళిక ప్రకారమే జరిగిందా లేదా అనే విషయాన్ని సాంకేతికంగా పరిశీలించాలని వారు కోరుతున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం, డివైడర్ స్థానంలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే భవిష్యత్తులో ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల రాకపోకలు మరియు రోడ్డు భద్రత పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని, అవసరమైతే ఆమోదిత డిజైన్‌కు అనుగుణంగా సవరణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






