- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ మిస్సింగ్ కేసు: కృష్ణలంక శ్మశాన వాటికలోనే దహనం?
సాయికృష్ణ మిస్సింగ్ కేసు పై కృష్ణలంక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఏసీపీ దైవప్రసాద్ టీమ్ వేగం పెంచింది. శనివారం ఉదయం కృష్ణలంక శ్మశాన వాటిక సిబ్బంది నుంచి గత నెలాఖరులో దహనం చేసిన అనాధ శవాల వివరాలను సేకరించారు. శ్మశాన వాటిక రికార్డులను పరిశీలించి, అందులో ఉన్న వివరాలను పోలీసులు సేకరించారు. సాయికృష్ణను పోలీసులే హత్య చేసి.. మృతదేహాన్ని దహనం చేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే కృష్ణలంక పోలీసులు శ్మశానవాటిలో ఎంక్వైరీ చేశారు. మే 23, 24, 25 తేదీల్లో దహనం చేసిన అనాధ శవాల వివరాలను ఆపరేటర్ రవిని అడిగి తెలుసుకున్నారు. మే 23న సాయంత్రం బస్టాండ్ వద్ద నుంచి ఒక అనాధ శవం రాగా.. 24న పోలీసుల నుంచి లేఖ వచ్చిందని, 25న ఆ డెడ్ బాడీని దహనం చేశామన్నారు. సాధారణంగా అనాధ మృతదేహాలు శ్మశాన వాటికకు వస్తే.. పోలీసుల నుంచి క్లియరెన్స్ లెటర్ వచ్చాక దానికి అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అయితే ఆపరేటర్ రవి చెప్పిన వివరాల ప్రకారం.. మే 24,25 తేదీల్లో ఆ శ్మశానవాటికకు నాలుగు డెడ్ బాడీలు రాగా.. ఆ నాలుగు ఎవరివన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఆ నాలుగు మృతదేహాల అస్తికల ద్వారా డీఎన్ఏ పరీక్షలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కానీ దాదాపు మృతదేహాలను దహనం చేసి నెలరోజులు కావస్తుండటంతో.. ఈ రిపోర్టులో కచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువే ఉంటాయి.






