స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరీష్‌

by velandi.Saikiran |

మండల కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరీష్‌
X

దిశ, బయ్యారం: మండల కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముస్థాఫా నగర్ లో అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి పిల్లల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తరగతి గదులను , హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పూర్తి స్థాయిలో బోధించ‌క‌పోవ‌డంపై కలెక్టర్ స్నేహ శబరీష్ సీరియ‌స్ అయ్యారు. సింగారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ టేకు చెట్ల నరికివేతపై కీల‌క ఆదేశాలు ఇచ్చారు. మండల అటవీ శాఖ అధికారి రవి కిరణ్ వివరణ తీసుకొని, విచారణ జరిపి సంబంధిత తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ సంతోష్, తాహశీల్దార్ నాగరాజు ,ఎంపీడీవో దీపిక, ఉపాద్యాయులు ధనుంజయ, వెంకటేశ్వర్లు,ఎస్సై ప్రశాంత్ బాబు, ఇతర పాఠశాల బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story