- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సడెన్ షాకిచ్చిన కయ్యదు లోహర్.. బ్రేక్ ప్రకటిస్తూ ఎమోషనల్ పోస్ట్
నేను వ్యక్తిగతంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, నా సినిమాలకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన అప్‌డేట్‌లు ఉంటే మాత్రం నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా మీతో పంచుకుంటుంది

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కయ్యదు లోహర్ సడెన్ షాకిచ్చారు. సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘నేను సోషల్ మీడియా నుండి కొద్దికాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా మనం అలసిపోయినప్పుడు మన శరీరానికి ఎలాంటి విశ్రాంతిని ఇస్తామో.. అలాగే మన మనసుకు కూడా కొన్నిసార్లు ప్రశాంతత, విశ్రాంతి చాలా అవసరం. అందుకే నా జీవితంలో కాస్త నెమ్మదించాలని, కొంతకాలం పాటు ఈ డిజిటల్ ప్రపంచానికి దూరంగా జరగాలని అనుకుంటున్నాను. తెర వెనుక ఉన్న నా అసలు జీవితంతో, నాతో నేను ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇక్కడ ఎంతో మద్దతునిచ్చి, ప్రోత్సహించి, ప్రేమను పంచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సందేశాలు, మీరు చూపించిన ప్రేమ నాకు ఎంతో విలువైనవి" అని రాసుకొచ్చారు.
అలాగే తన సినిమాల అప్‌డేట్స్ గురించి చెప్తూ.. "నేను వ్యక్తిగతంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, నా సినిమాలకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన అప్‌డేట్‌లు ఉంటే మాత్రం నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా మీతో పంచుకుంటుంది. అందరూ శాంతి, సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మళ్లీ త్వరలోనే కలుద్దాం" అంటూ కయ్యదు లోహర్ ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ భామ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలో ఆమె సడెన్‌గా ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఆమె కేవలం సోషల్ మీడియాకే బ్రేక్ ఇచ్చిందా.. లేక నాని ‘ది ప్యారడైజ్’ సినిమా నుండి కూడా తప్పుకుంటుందా? అనే పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కయ్యదు లోమర్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.






