- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో టీ20లో భారత్‌పై ఇంగ్లండ్ విజయం
బ్రిస్టల్ వేదికగా శనివారం జరిగిన రెండో మహిళల టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.

దిశ, వెబ్ డెస్క్ : బ్రిస్టల్ వేదికగా శనివారం జరిగిన రెండో మహిళల టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు డాని వైట్-హాడ్జ్, సోఫియా డంక్లీ జట్టుకు శుభారంభం అందించగా, చివర్లో ఫ్రేయా కెంప్ కేవలం 13 బంతుల్లో 39 పరుగులు చేసి స్కోరును భారీ స్థాయికి చేర్చింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. యస్తికా భాటియా 33 పరుగులతో పోరాడినా, ఇతర బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేయా కెంప్ 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీయగా, చార్లీ డీన్, లారెన్ బెల్ కూడా కీలక వికెట్లు సాధించారు. ఇటు బ్యాటింగులోను, అటు బౌలింగులోనూ రాణించిన ఫ్రేయా కెంప్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇక సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి టీ20 మ్యాచ్ జూన్ 2న టాంటన్‌లో జరగనుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
- Tags
- T20
- ENG vs IND






