- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవనం పైనుంచి పడి ఇంజనీర్ మృతి
by Jakkula.Mamatha |
భవనం పైనుంచి పడి సైట్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, కార్వాన్: భవనం పైనుంచి పడి సైట్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ నరేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో హాస్టల్ వసతుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే నిజామాబాద్‌కి చెందిన ధనుజ్(27) సైట్ ఇంజనీర్ ఐదవ అంతస్తులో గోడ నిర్మాణం కోసం కొలతలు చేపట్టే సమయంలో కాలు జారి కింద పడ్డాడు. కాగా, ఈ ఘటన 15 రోజుల క్రితం జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? ఎత్తులో పనులు చేసేటప్పుడు ఉండవలసిన ప్రాథమిక భద్రతా పరికరాల కొరత వల్ల ఇంజనీర్ మరణించి ఉండవచ్చని పలువురు ఆరోపిస్తున్నారు.
Next Story






