ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూలో నాజూకైన అందాలతో హీట్ పెంచుతున్న కళ్యాణి ప్రియదర్శన్

by Pulgam srinivas |

కిల్లింగ్ లుక్స్‌తో కట్టిపడేసిన కళ్యాణి ప్రియదర్శన్.

ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూలో నాజూకైన అందాలతో హీట్ పెంచుతున్న కళ్యాణి ప్రియదర్శన్
X

దిశ, వెబ్ డెస్క్: నటి కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సహా పలు భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ, నటిగా మంచి పేరు తెచ్చుకుంది.




ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'లోకా: ఛాప్టర్ 1 - చంద్ర' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో కళ్యాణి ప్రియదర్శన్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కెరీర్‌ను కొనసాగిస్తోంది.




కెరీర్ ప్రారంభించి చాలా కాలమైనప్పటికీ కళ్యాణి ప్రియదర్శన్ ఎప్పుడూ గ్లామర్ షోకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హద్దులు దాటకుండా తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తోంది.




అయితే తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో రంగురంగుల డ్రెస్‌లో మెరిసిపోయిన కళ్యాణి, చున్నీని చేతిపై వేసుకుని తన నడుము అందాలు హైలైట్ అయ్యేలా స్టైలిష్ పోజులు ఇచ్చింది.




ముఖంపైకి, వెనుకకు జారేలా వదిలిన జుట్టు, చెవులకు ధరించిన భారీ ఇయర్‌రింగ్స్ ఆమె లుక్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కళ్యాణి ఇచ్చిన ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.

Next Story