- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలానగర్ ఎమ్మార్వో ఆఫీస్‌లో ‘ఖాళీ కుర్చీలు’.. గంటల తరబడి అధికారుల కోసం ప్రజల నిరీక్షణ!
బాలానగర్ ఎమ్మార్వో(తహసీల్దార్) కార్యాలయంలో ప్రజలకు సేవలు అందించే అధికారుల సీట్లు పలుచోట్ల ఖాళీగా కనిపించడంతో పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ,బాలానగర్: బాలానగర్ ఎమ్మార్వో(తహసీల్దార్) కార్యాలయంలో ప్రజలకు సేవలు అందించే అధికారుల సీట్లు పలుచోట్ల ఖాళీగా కనిపించడంతో పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మి దరఖాస్తులు, జనన ధ్రువపత్రాలు(బర్త్ సర్టిఫికెట్లు), ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాల కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు.
అయితే సంబంధిత అధికారులు ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ(SIR) కార్యక్రమంలో అధికారులు నిమగ్నమై ఉండటంతో బాలానగర్ ఎమ్మార్వో(తహసీల్దార్) కార్యాలయంలో ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం ఏర్పడుతుందని ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు, ఇతర అధికారిక పనులతో బిజీగా ఉండటం వల్ల కొంత సేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు చెబుతున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా, తగిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలకు వేగవంతంగా సేవలు అందించే విధంగా ప్రత్యేక కౌంటర్లు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






