మాటల కంటే భావాలే ముఖ్యం.. హృదయాన్ని హత్తుకునేలా ‘గాంధీ టాక్స్’ ట్రైలర్

by Mallepaka Hamsa |

‘గాంధీ టాక్స్’(Gandhi Talks) ట్రైలర్ విడుదలైంది.

మాటల కంటే భావాలే ముఖ్యం.. హృదయాన్ని హత్తుకునేలా ‘గాంధీ టాక్స్’ ట్రైలర్
X

దిశ, సినిమా: జీ స్టూడియోస్, క్యూరియస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్‌మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి రూపొందించిన చిత్రం ‘గాంధీ టాక్స్’(Gandhi Talks) ట్రైలర్ విడుదలైంది. డైలాగ్స్ లేకుండా, మౌనం–భావోద్వేగాలే కథగా సాగే వినూత్న ప్రయత్నం ఇది. విజయ్ సేతుపతి(Vijay Sethupathi), అరవింద్ స్వామి, అదితి రావు హైదరి(Aditi Rao Hydari), సిద్ధార్థ్ జాధవ్ (Siddharth Jadhav)నటన ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. మాటలకన్నా హావభావాలే బలంగా మాట్లాడేలా దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మౌనంలోనూ భావాలను చెప్పేలా ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ట్రైలర్ లాంచ్‌లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘గాంధీ టాక్స్’లో నటించటం నటుడిగా నాకొక పెద్ద చాలెంజ్‌గా మారింది. మౌన‌మే ఇందులో అత్యంత బ‌ల‌మైన డైలాగ్‌గా ఉన్న అరుదైన సినిమా ఇది’ అన్నారు. అదితిరావు హైద‌రి మాట్లాడుతూ ‘గాంధీ టాక్స్ సినిమాలో మాటల కంటే భావాలే మనల్ని కదిలించటం నాకు బాగా నచ్చింది. సున్నితత్వం, మౌనం రెండూ ఎంతో అందంగా క‌ల‌గ‌లిసిన‌ట్లు ఈ సినిమా చూపిస్తుందని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రం జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Next Story