గూగుల్ కో-ఫౌండర్‌ భార్యతో ఎఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన Elon Musk

by Satheesh |   (  Updated:2022-07-25 12:19:00  IST  )

Elon Musk Denies Affair with Google Co-founder's Wife| గూగుల్ కో ఫౌండర్ సెర్గే బ్రిన్, భార్య నికోల్ షానహాన్‌తో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎఫైర్ నడిపించాడంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది. ఈ కారణంగా బ్రిన్, తన భార్య నికోల్

Elon Musk Denies Affair with Google Co-founder
X

దిశ, వెబ్‌డెస్క్: Elon Musk Denies Affair with Google Co-founder's Wife| గూగుల్ కో ఫౌండర్ సెర్గే బ్రిన్, భార్య నికోల్ షానహాన్‌తో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎఫైర్ నడిపించాడంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది. ఈ కారణంగా బ్రిన్, తన భార్య నికోల్ షానవాన్‌తో విడాకులు కావాలని ఈ ఏడాది మొదట్లో దరఖాస్తు చేసుకున్నాడని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ కథనంలో పేర్కొంది. దీంతో సెర్గే బ్రిన్, ఎలన్ మస్క్‌ల మధ్య స్నేహం చెడిందని.. ఇద్దరి మధ్య మనస్పర్థాలు వచ్చాయని ఆ కథనంలో రాసుకొచ్చారు. కాగా, ఈ వార్తలపై ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చాడు. నికోల్ షానవాన్‌తో ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేశాడు. తాను, సెర్గే బ్రిన్ మంచి స్నేహితులమని.. నిన్న రాత్రే ఇద్దరం కలిసి ఒక పార్టీలో పాల్గొన్నామని తెలిపారు. అంతేకాకుండా గడిచిన మూడేళ్లలో తాను నికోల్ షానహాన్‌ను కేవలం రెండు సార్లు మాత్రమే చూశానని.. అది కూడా చాలా మంది మధ్యలోనే అని మస్క్ వెల్లడించాడు.

ఇది కూడా చదవండి: 'పెళ్లికాని అమ్మాయి' అలా చేయ‌కూడ‌దు.. చైనా కోర్టు సంచ‌ల‌న తీర్పు

Next Story