రహదారి పక్కన ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

by Batti.Sumithra |

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తాటిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి శివ మార్కండేయ గుడి పక్కనే నివాసాలకు అతి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది.

రహదారి పక్కన ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
X

దిశ, మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తాటిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి శివ మార్కండేయ గుడి పక్కనే నివాసాలకు అతి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉండడం, చుట్టూ రక్షణ వలయం లేకపోవడంతో ఏ సమయంలో ఏం ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతినిత్యం వాహన చోదకులు, బాటసారులు తిరుగుతుండడంతో ప్రమాదాలకు అవకాశం కలదని ఆరోపిస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు బిగించిన ట్రాన్స్‌ఫార్మర్‌ భూమి నుంచి తక్కువ ఎత్తులో ఉండడంతో జనావాసులకు, పశువులకు సైతం ప్రమాదం పొంచి ఉన్నదని గ్రామస్తులు, ప్రయాణికులు పేర్కొన్నారు. విద్యుత్తు ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదం జరిగకముందే ట్రాన్స్‌ఫార్మర్‌ ఇక్కడి నుంచి తొలగించి మరో చోటికి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story