ఆ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి: కాంగ్రెస్

by Web Desk |
ఆ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి: కాంగ్రెస్
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లులలో డెవలప్మెంట్ చార్జీల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు ఆర్థిక భారం మోపుతున్నారని కాంగ్రెస్ నాయకులు విజయరమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ డెవలప్మెంట్ చార్జీలు ఉపసంహరించుకోవాలని (TSNPDCL SE) జిల్లా సూపరింటెండెంట్, ఇంజినిర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు చార్జీలు ఏ విధంగా ఉన్నాయో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ.. గమనించాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పెంచిన విద్యుత్ డెవలప్మెంట్ చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు.

లేని పక్షం లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచన మేరకు మండలాల, గ్రామాల వారీగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే విద్యా వ్యాపారాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వానికి కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. కనుక వారికి విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఆర్థిక భారం లేదని.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మీ కరెంటు బిల్లులు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయో ఒకసారి ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, అన్నయ్య గౌడ్, నూగిల్ల మల్లయ్య, మినుపాల ప్రకాష్ రావు, సుల్తానాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దన్నాయక్ దామోదర్ రావు, పెద్దపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్గొండ కుమార్, పట్టణ అధ్యక్షుడు భూషవేన సురేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed