- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేవెళ్లలో వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక
చేవెళ్ల మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి, నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.

దిశ, చేవెళ్ల : చేవెళ్ల మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి, నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్‌ఆర్‌ఈజీఎస్ యూపీఏ–1 ప్రభుత్వ హయాంలో వామపక్ష పార్టీల కృషి ఫలితంగా అమల్లోకి వచ్చిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం అప్పటి కమ్యూనిస్టు నాయకులు పార్లమెంట్‌లో పోరాడి ఈ చట్టం ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేపడుతోందని విమర్శించారు. పథకానికి పేరు మార్చడం, నిధుల కోత విధించడం, ఆన్‌లైన్ ఫొటో విధానాన్ని అమలు చేయడం వంటి చర్యల వల్ల సర్వర్ సమస్యలు తలెత్తి కార్మికులు ఉపాధి హామీ పనులకు దూరమవుతున్నారని ఆరోపించారు.
కార్మికులు పనులకు రాకుండా చేయాలనే దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడిగా చనువల్లి గ్రామానికి చెందిన మహేందర్‌ను, ప్రధాన కార్యదర్శిగా కౌకుంట్ల గ్రామానికి చెందిన రాజును ఎన్నుకున్నారు. మహిళా కన్వీనర్లుగా ఉషారాణి, భారతి ఎంపిక కాగా, మరో 12 మందిని మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధి హామీ కూలీలపై ఉందని నాయకులు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ చేవెళ్ల మండల కన్వీనర్ జంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నర్సింలు, శ్రీనివాస్, ఎ. అంజనేయులు, వెంకటేష్, రామచంద్రయ్య, కిష్టయ్య, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.






