- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"నన్ను ఆపేవాళ్లు ఈ గడ్డమీద పుట్టలేదు" : సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి కౌంటర్
తనను పొలిమేర దాటనివ్వనన్న సీఎం రేవంత్ రెడ్డికి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. "నన్ను పొలిమేర దాటనివ్వను అంటున్నారు.. నన్ను ఆపేవారు ఇంకా ఈ గడ్డపై పుట్టలేదు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడటానికి నేను కేసీఆర్ ను కాను" అని ధీటుగా బదులిచ్చారు. రేవంత్ రెడ్డిలో రాజకీయ నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. చేతలు మాత్రం సెక్రటేరియట్ కూడా దాటడం లేదన్నారు. త్వరలోనే కాంగ్రెస్ ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని, రాహుల్ గాంధీ ఈ జన్మలో, కలలో కూడా ప్రధాని కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతులను దారుణంగా మోసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతులకు, వడ్లకు ఇస్తానన్న బోనస్ డబ్బులు ఇంకా ఇవ్వలేదన్నారు. అలాగే రైతు కూలీలకు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఊసే లేదని, రైతు రుణమాఫీ కూడా అరకొరగానే చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. కేంద్రం, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలతో రేవంత్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని విమర్శించారు. తానేంటో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసని, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మాటల పార్టీలే తప్ప.. చేతల పార్టీలు కావన్నారు. తెలంగాణకు తానేం చేశానో రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఫైరయ్యారు. రేవంత్ సర్కారుకు అసలు ముసళ్ల పండుగ ముందు ఉందని, ముందుంది ముసళ్ల పండుగ.. రేవంత్ రెడ్డి తొందరపడొద్దు.. ఎవరెంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తాము ఏం చేసినా సంయమనంతో చేస్తాం.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలన్నదే మా ఆశయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాను పుట్టింది బీజేపీలోనే.. చచ్చేది బీజేపీలోనే అని.. 10 పార్టీలు మారలేదని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.






