ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

by Batti.Sumithra |

మండల పరిధిలోని రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-2008 సంవత్సరంలో పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
X

దిశ, తలకొండపల్లి : మండల పరిధిలోని రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-2008 సంవత్సరంలో పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆనాడు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు కాశన్న, వెంకటస్వామి, ప్రమోద్, బద్రి నాయక్, అశోక్, మైపాల్ రెడ్డి టీచర్లను పూర్వ విద్యార్థులు పూలమాలలు శార్వాలతో ఘనంగా సన్మానించి ఉపాధ్యాయుల ఆశీర్వచనం తీసుకున్నారు. 18 సంవత్సరాల తర్వాత ఒకచోట కలుసుకున్న స్నేహితులు తాము చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో ఒకచోట చదువుకున్న నేడు ఎక్కడెక్కడో స్థిరపడ్డ అందరం కలిసి మెలిసి ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకుంటూ, నిజమైన పేదవారికి తోచిన ఆర్థిక సాయం అందిస్తూ చేయూతనివ్వాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థినులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story