- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శేరిలింగంపల్లి జోన్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నారాయణ అమిత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఉద్యోగుల్లో జవాబుదారితనం పెంపొందించడం ద్వారా అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతున్నారు.

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నారాయణ అమిత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఉద్యోగుల్లో జవాబుదారితనం పెంపొందించడం ద్వారా అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరించడం మొదలుకొని వాటి పరిష్కారం దరఖాస్తుదారుల మనోగతాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపడుతూనే ఎక్కువ కాలం కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు. శేరిలింగంపల్లి జోన్ లో రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులు ఏడాదిలోపే పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్న నారాయణ అమిత్ దిశతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఉన్న 26 వార్డులలో ప్రాథమిక అవసరాలు బట్టి క్షేత్రస్థాయి పర్యటన ఉంటుంది. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నిరంతరం సమీక్ష నిర్వహించడం ద్వారా ఉద్యోగుల్లో జవాబుదారితనం, పనితీరు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఐటీ కారిడార్ లో పరిసరాలు ఆకర్షణీయంగా తయారు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. గోపన్ పల్లి, నల్లగండ్ల, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్లకు థీమ్ పెయింటింగ్, తెల్లాపూర్ ఎలియన్స్ స్టేషన్ నుంచి కొల్లూరు ఎగ్జిట్ వరకు సెంట్రల్ లైటు ఏర్పాటు, హెచ్ సి టి ప్రాజెక్టు కింద గ్రేటర్ హైదరాబాద్ కు 20 ప్రాజెక్ట్లు మంజూరు కాగా అందులో శేర్లింగంపల్లి జోన్ కు ఏడు ప్రాజెక్టులు వచ్చాయి. ఖాజా గూడా, త్రిబుల్ ఐటీ, లింగంపల్లి ప్లై ఓవర్, అమీన్పూర్ కనెక్టెడ్ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభమవుతాయి.
మియాపూర్ చౌరస్తా నుంచి బొల్లారం వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం
మియాపూర్ నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు, మియాపూర్ చౌరస్తా నుంచి బొల్లారం వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం, ఆల్విన్ చౌరస్తా నుండి హఫీజ్పేట్ వరకు అండర్ పాస్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుంది. ఈ పనులన్నీ ఏడాదిలోపు పూర్తి అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాము. ప్రతి ఇంటి నుంచి స్వీకరించే తడి, పొడి చెత్త హజార్డస్, ప్లాస్టిక్ ఇలా నాలుగు భాగాలుగా విభజించే స్వచ్ఛ ఆటో లో తరలించే ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. టీఎన్జీవో, హుడా కాలనీలలో థీమ్ పార్కుల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. చందానగర్ పిజెఆర్ స్టేడియంను ఐదు ఎకరాల్లో అభివృద్ధి చేసి అదనంగా మరిన్నీ క్రీడలు ఆడుకునే వసతులు కల్పిస్తున్నాం. ప్రధాన జంక్షన్ లు అభివృద్ధి చేసి ఐలాండ్, పచ్చదనం, విద్యుత్ దీపాలు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మణికొండలో పందెం వాగు, మల్కం చెరువు నుంచి ఇబ్రహీం బాగ్ నాలా అభివృద్ధి చేసి గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి కి శ్రీకారం చుడతాం. నీరు నిల్వ ప్రాంతాలు గుర్తించి బాక్స్ డ్రైన్ నిర్మిస్తాం. గత వర్షాకాలంలో కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా నీటి ప్రవాహం పెను సమస్యగా మారింది. ఇందుకు గల కారణాలు అన్వేషించి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.






