- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తపుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారం.. యాక్షన్‌లోకి రోబోటిక్ డాగ్స్, బ్యాక్ ప్యాక్ ఎల్‌ఈడీలు
మన దేశంలో 80, 90 దశకాల్లో ఎన్నికల ప్రచారం అంటే గోడల మీద రాతలు, మైకు సెట్లు, భారీ బహిరంగ సభలే కనబడేవి. కానీ, ఇప్పుడు సీన్ మొత్తం మారిందండోయ్.

దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో 80, 90 దశకాల్లో ఎన్నికల ప్రచారం అంటే గోడల మీద రాతలు, మైకు సెట్లు, భారీ బహిరంగ సభలే కనబడేవి. కానీ, ఇప్పుడు సీన్ మొత్తం మారిందండోయ్. ఓటరు నాడిని పట్టుకుని ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు పొలిటికల్ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రచారం వీధి గోడల నుంచి సోషల్ మీడియా వాల్స్ వరకు, కరపత్రాల నుంచి వాట్సాప్ సందేశాల వరకు ప్రచార శైలి పూర్తిగా డిజిటల్‌మయమైంది.
ఈ నేపథ్యంలోనే టెక్నాలజీని బేస్ చేసుకుని జనవరి 15న పుణేలో జరుగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు హైటెక్ ప్రచారానికి తెరలేపారు. రాజకీయ నాయకుల పోస్టర్లతో రోబోటిక్ డాగ్స్‌ను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. ఆ చిత్రం చూసిన జనం కూడా ‘వాట్ ఎ టెక్నాలజీ’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు ఎల్‌ఈడీ స్క్రీన్లను బ్యాక్‌ప్యాక్‌లా మోసుకెళ్తూ వీధుల్లో ప్రచారం చేస్తూ తిరుగుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తక్కువ ఖర్చుతో సరికొత్త స్ట్రాటజీ..
ఎన్నికల సమయం తక్కువగా ఉండటం వల్ల అభ్యర్థులు ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారాన్ని బలోపేతం చేయడానికి AI సాయంతో వీడియోలు, రీల్స్, కంటెంట్ తయారుచేసి సోషల్ మీడియాలోకి సైలెంట్‌గా వదులుతున్నారు. ఫలితంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయం ఆదా అవుతోంది. కొందరు అభ్యర్థులు ఓటర్ల అనుభవాలు, అభిప్రాయాలను విశ్లేషించడానికి AIని ఉపయోగిస్తున్నారు. చాట్‌బాట్ల ద్వారా ప్రజలతో సంభాషణలు కూడా జరుపుతున్నారు. లోహేగావ్, విమాన్‌నగర్, వాఘోలి వంటి ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రాజెక్ట్ టైమ్‌లైన్లు, డేటా ఆధారిత ప్రెజెంటేషన్లు, పనితీరు సూచికలతో ఓటర్లకు వాగ్దానాల అమలును స్పష్టంగా వివరిస్తూ ప్రచారంలో పాదరసంలా దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల పుణ్యాన పూణే టెక్నాలజీ వినియోగానికి బ్రాండ్‌గా నిలిచింది.






